మరింత ఉత్సాహంగా ప్రజా సేవలో పాల్గొంటా : కేటీఆర్
తెలంగాణ భవన్‌లో ఘనంగా జన్మదిన వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ / మర్కుక్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పారు. తనను అభిమానించే వారి ప్రేమ ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానని ఆయన తెలిపారు.
కేటీఆర్‌ను దీవించిన కేసీఆర్
కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత, కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ ,పుత్రుడు హిమాన్షుతో కలిసి ఆయన ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. తన తల్లిదండ్రులను కలిసిన ఆయన వారికి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడిని ఆలింగనం చేసుకున్న కేసీఆర్ ఆయన్ను దీవించారు.
మీరు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలి… కేటీఆర్‌కు సీఎం రేవంత్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
‘మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలి…’ అని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా కేటీఆర్ బర్త్‌డే విషెష్ తెలిపారు. నిత్యం ప్రజా సేవలో నిమగమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు.
కవిత శుభాకాంక్షలు…
తన అన్న కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘అన్నయ్య కేటీఆర్‌కు… పుట్టిన రోజు శుభాకాంక్షలు…’ అని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
మీ ఆశీర్వాదాలతో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES