Wednesday, August 6, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రవాణా లేకపోతే అభివృద్ధి ఆగుతుంది

రవాణా లేకపోతే అభివృద్ధి ఆగుతుంది

- Advertisement -

జన్నారం మండల కేంద్రం గుండా భారీ వాహనాలను అనుమతించాలి సీపీఐ డిమాండ్
నవతెలంగాణ – జన్నారం

ఏ ప్రాంతంలోనైతే రవాణా సౌకర్యాలు ఉండవో ఆ ప్రాంతం అభివృద్ధి సక్రమంగా జరగదని, అటవీ శాఖ తీసుకున్న భారీ వాహనాల రాకపోకల నిషేధాన్ని ఎత్తివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కళిందర్ఖాన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గత 22 రోజులుగా నిరావాదిక దీక్ష చేస్తున్న వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జన్నారం మండల కేంద్రంలో ప్రజా ఉద్యమ రూపంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు.

 రాష్ట్ర అటవీ శాఖ జారిచేసిన చట్టం ప్రకారం జన్నారం కడెం దండేపల్లి మండలాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే చందంగా ఉంది భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయడం ద్వారా వివిధ మండలాల్లోని గ్రామాల ప్రజలకు పెను భారంగా ఉందన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. నిర్మాణరంగం కుంటు పడడం ద్వారా నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస పనులు దొరకక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ మండలాలు వ్యవసాయ మండలాలు కావడం వల్ల కూడా విత్తనాలు ఎరువులు మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు.

  ప్రజలకు రాష్ట్ర అటవీ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే రద్దు చేయాలని కోరుతూ తక్షణమే ఈ ఆంక్షలను ఎత్తివేయాలి ఏ ప్రభుత్వాలైనా గాని ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తేవాలి కానీ ప్రజా వ్యతిరేక చట్టాల ద్వారా ప్రజా జీవితాలను భగ్నం చేయకూడదని హితవు పలికారు.ఇలాంటి అంశాల ద్వారా పాలక ప్రభుత్వాలపై ప్రజలకు అసహనము పెళ్ళుబికి ప్రజా తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  ఈ పాలక ప్రభుత్వాలు అటవీ ఆంక్షలు సడలించి మూడు ప్రభావిత మండలాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జనరంజకమైన ప్రజా ఉపయోగకర నిర్ణయాలను తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దాసరి తిరుపతి జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న జన్నారం మండల కన్వీనర్ మామిడి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -