Saturday, May 17, 2025
Homeమానవిఆందోళన లేకుండా..

ఆందోళన లేకుండా..

- Advertisement -

నేటి బిజీ జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం ఓ వరమే. ఎన్నో టెన్షన్స్‌, నిత్యం బిజీబీజీ లైఫ్‌ స్టైల్‌ వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు చాలా మంది. దీని ప్రభావం వారి ఆరోగ్యంపైన పడుతుంది. నిద్ర కూడా కరువవుతుంది. నిద్రలోపిస్తే ఏకాగ్రతా దెబ్బతింటుంది.
ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్‌ చేస్తుంటారు. బాగా నిద్ర పట్టాలంటే కొన్ని చిట్టాలను చూద్దాం..
– నిద్ర ఆనేది శారీరక అవసరం అయినా.. దానికి మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే మీరు ఆనందంగా ఉన్న క్షణాలను గుర్తు తెచ్చుకోండి. దీంతో కాస్త ప్రశాంతత కలుగుతుంది.
– టెన్షన్‌ తో నిద్రపట్టకపోతే 15 నుంచి 20 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
– నిజానికి మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల లేనిపోని టెన్షన్స్‌ మనమే క్రియేట్‌ చేసుకుంటాం. అందుకే అయిందేదో అయింది.. అంతా మనమంచికే.. జరిగేదేదో అది కూడా మన మంచికే అని అనుకోవడం ప్రారంభించండి. ఇలా అనుకోవడంవల్ల దిగులు తగ్గుతుంది.
– చాలా మంది ప్లానింగ్‌ లేకుండా పని చేస్తుంటారు. దీని వల్ల కూడా టెన్షన్‌ పెరిగి అది నిద్ర కరువు అవుతుంది. అందుకే మరుసటి రోజుకు సంబంధించి ఒక ప్లానింగ్‌ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. దాంతో ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -