Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారంలో పట్టపగలే మట్టిని తోడేస్తున్న తోడేళ్ళు

కాటారంలో పట్టపగలే మట్టిని తోడేస్తున్న తోడేళ్ళు

- Advertisement -

పంప్‌హౌస్ నుంచి ఏటీసి సెంటర్ వరకు సాగిన రవాణా
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరంగా మట్టి రవాణా 
రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖలు “మౌనం  
నవతెలంగాణ – కాటారం 

కాటారంలో పట్టపగలే మట్టి బకాసురులు రెచ్చిపోతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దఎత్తున మట్టి తరలింపు జరిగినప్పటికీ, ఈ ఘటన అధికారుల దృష్టికి రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంప్‌హౌస్ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల నుంచి భారీగా మట్టిని తవ్వి ట్రక్కులు, ట్రాక్టర్ల ద్వారా కాటారం ఏటీసి సెంటర్ వైపు తరలించారు. ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైన ఈ రవాణా సాయంత్రం 6 గంటల వరకు నిరంతరంగా కొనసాగిందని స్థానికులు చెబుతున్నారు. దాదాపు 100కు పైగా వాహనాల్లో మట్టిని తరలించారని చెబుతున్నారు.

ఇంత పెద్ద ఎత్తున మట్టి తరలింపు జరిగితే అది మాకు మాత్రమే కనిపించడం, అధికారులకు కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖలు “మాకు సమాచారం లేదు” అనే ధోరణిలో ఉండటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా జరిగిన ఈ మట్టి రవాణా వల్ల ప్రభుత్వ భూములు, పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. చెక్‌పోస్టులు లేకపోవడం, ఎవరూ అడ్డుకోకపోవడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయి.

స్థానికులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సేకరించి అధికారులకు అందజేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు. “మట్టి మాత్రమే కాదు… బాధ్యత కూడా మెల్లగా మాయం అవుతోంది” అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దర్యాప్తు చేపట్టి, నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే ఇలాంటి ‘అదృశ్య రవాణాలు’ మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -