Wednesday, April 8, 2026
E-PAPER
Homeక్రైమ్మానవ హక్కుల కమిషన్‌ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

మానవ హక్కుల కమిషన్‌ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

- Advertisement -

అక్రమ కేసు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌

తనపై బంగారం దొంగతనం కేసు పెట్టి పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, వేధిస్తున్నారంటూ ఓ మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఎదుట కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ పరిధిలో మంగళవారం జరిగింది. కవాడిగూడలోని నెక్లస్‌ ప్రైడ్‌ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న శ్రీవాణి ఐదేండ్లుగా అదే అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో పనిచేస్తున్నట్టు తెలిపింది. తాను నమ్మకంగా పని చేస్తున్నప్పటికీ బంగారం పోయిందని తప్పుడు ఆరోపణలు మోపి పోలీసులతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎలాంటి దొంగతనమూ చేయలేదని చెప్పినా వినకుండా, నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి చేసి కవాడిగూడ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అదేవిధంగా తాను దొంగతనం చేశానని తన ఫొటోను అపార్ట్‌మెంట్‌ అంతటా గోడలపై అతికించడం ద్వారా అవమానానికి గురిచేశారని బాధితురాలు కన్నీరు పెట్టుకున్నారు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌ ఎదుట కిరోసిన్‌ పోసుకున్నానని చెప్పింది. ఈ ఘటనపై సంబంధిత ఫ్లాట్‌ యజమానురాలిపైనా, కవాడిగూడ పోలీసులపైనా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని శ్రీవాణి కమిషన్‌ను వేడుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -