- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఖమ్మంలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కస్బాబజార్‌లోని ఓ మాల్ పక్క సందులో సుమారు 35ఏళ్ల వయసున్న గుర్తు తెలియని మహిళ రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికులు సమాచారం అందించగా ఖమ్మం ఒకటో పట్టణ ఎస్సై మౌలానా ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోయటంతో ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. సదరు మహిళ వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈమె కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన మహిళగా తెలిసింది.
- Advertisement -



