Tuesday, May 13, 2025
Homeక్రైమ్మహిళ ఆత్మహత్య ..

మహిళ ఆత్మహత్య ..

- Advertisement -

నవతెలంగాణ   కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో జీవితం పై విరక్తితో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ పోలీసులు ఒక ప్రకటన తెలిపారు. కామారెడ్డి విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న మంగలి శ్రీవిద్య ( 23 )  అను ఆమె తన భర్త అయిన బాలకిశన్ తో విడిగా ఉంటూ, ఆమె సోదరీ అయినా మంగలి శ్రీమతితో కలిసి విద్యానగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. శ్రీవిద్య కల్లు తాగడం, గుట్కాలు తినడం, మొదలగు చెడలవాట్లకు బానిసై, వేళా పాల లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండేదని, ఈనెల10న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీవిద్య తిరిగి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి, రూమ్ లో గడియ పెట్టుకుని పడుకున్నదని, ఆ తర్వాత ఎంత డోర్ కొట్టిన తీయకపోయేసరికి, కల్లు తాగి పండుకున్నదని ఉద్దేశంతో ఆమె సోదరీ అయిన శ్రీమతి సోమవారం ఉదయం సమయంలో ఆమె తల్లి, తమ్ముడు తెలియజేసింది. అందరూ వచ్చి డోరు తీయడానికి ప్రయత్నించగా, లోపలి నుండి గడియ పెట్టడం వల్ల, గట్టిగా తోసి, డోరు విరగొట్టి, లోపలికి వెళ్లి చూసేసరికి శ్రీవిద్య చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయి ఉంది. ఈమె చెడు అలవాట్లకు బానిసై, జీవితంపై విరక్తితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా, ఆమె సోదరీ అయిన మంగలి శ్రీమతి ఇచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేయడం జరిగింది. పోస్టుమార్టం అనంతరం మృతురాలి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -