- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి (D) మీర్‌పేట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కుమారుడికి విషమిచ్చి.. తానూ ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ (D) రామన్నపేటకు చెందిన యశ్వంత్ రెడ్డి, సుస్మిత (27) దంపతులకు అశ్వంత్ నందన్ రెడ్డి(11 నెలలు) అనే బాబు ఉన్నాడు. వీరు హస్తినాపురం జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నారు. అయితే గురువారం భర్త ఆఫీసుకు వెళ్లి, తిరిగి ఇంటికిరాగా భార్య గదిలో ఫ్యానుకు ఉరేసుకోగా.. కుమారుడు మృతి చెంది ఉన్నాడు. సుస్మిత తల్లి లలిత (50) సైతం అపస్మారక స్థితిలో ఉండగా.. ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



