Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపాము కాటుకు గురై మహిళ మృతి

పాము కాటుకు గురై మహిళ మృతి

- Advertisement -

నవతెలంగాణ-కొణిజర్ల
పాముకాటుకు గురై మహిళ మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అన్నవరం గ్రామంలో బుధవారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాణోత్‌ వాలి(45) కూలీలతో కలిసి ఉదయం మొక్కజొన్న కంకి విరిసే పనికి వెళ్లింది. పొలంలో కంకి విరిసే క్రమంలో రక్తపింజర కాటు వేయటంతో కూలీలు గమనించి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందింది. పామును స్థానికులు కొట్టి చంపారు. మృతురాలికి సాయికుమార్‌, సంతోష్‌ అనే కుమారులు ఉన్నారు. తల్లి మృతి చెందటంతో పిల్లలు రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడిపెట్టించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -