నవతెలంగాణ-మిర్యాలగూడ : కరెంటు షాక్ తో మహిళా మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ మండలంలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన శిరీషాల నరసమ్మ (58) కూలి పని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తుంది. బుధవారం కూలి పనికి వెళ్లిన ఆమె సాయంత్రం ఇంటికి తిరిగివచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో ఉతికిన బట్టలు ఇంటి ఆవరణలో ఉన్న దండంపై ఆరేస్తుండగా కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం ఉదయం గ్రామంలోని తోటి మహిళా కూలీలు నరసమ్మకు కూలి పనికి తీసుకెళ్ళేందుకు ఇంటికి వెళ్లి పిలువగా ఎంతకు పలకకపోవడంతో అనుమానం వచ్చి లోపల వెళ్లి చూడగా దండెం వద్ద విగితజీవితగా పడి ఉంది. దీంతో ఆమెను చూసిన కూలీలు స్థానికులకు, చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. కాగా నరసమ్మ భర్త ఇటీవల కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఆమె కు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. ఆమె ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుంది. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కరెంట్ షాక్ తో మహిళా మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES