భర్తనే హత్య చేశాడని బంధువులు ఆరోపణ
న్యాయం చేయాలని ధర్నా, రాస్తారోకో
నవతెలంగాణ – మిర్యాలగూడ
అనుమానాస్పద స్థితిలో మహిళా మృతి చెందిన సంఘటన అడవిదేవులపల్లి మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. తన భార్య ఆత్మహత్య చేసుకుందని మృతి దేహాన్ని మిర్యాలగూడలో ఏరియా ఆస్పత్రికి తరలించగా, నా కూతురిని భర్త అత్తమామలు హత్య చేశారని, వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన సంఘటన శుక్రవారం మిర్యాలగూడలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం…. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బాపన్ భాయ్ తండాకు చెందిన రజితను అడవిదేవులపల్లి మండలంలోని బాల్నేపల్లి గ్రామానికి చెందిన రూపావత్ ఆంజనేయులు కు ఇచ్చి 2015 లో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు కవలలుగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ దంపతులు అడవిదేవులపల్లి మండల కేంద్రంలో ఉన్న తేజ టాలెంట్ స్కూల్ ను నడుపుతున్నారు. ఆంజనేయులు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో వీరి మధ్య గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాలతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తండ్రి పరశురాములు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా గురువారం రాత్రి రజిత ఆత్మహత్య చేసుకుందని, ఏరియా ఆస్పత్రిలో ఉందని ఆంజనేయులు తన స్నేహితుడైన కృష్ణ నాయక్ తో రజిత తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రజితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని భర్త ఆంజనేయులు, అత్త బాజు, మామా సూర్య, మరిది భోగ్య కారణమని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏరియా ఆస్పత్రి ముందు ధర్నా, గాంధీ విగ్రహం వద్ద రాస్తారోకో చేశారు.
ఆంజనేయులకు ఉన్న ఆస్తిని పిల్లల పేరున చేయాలని డిమాండ్ చేశారు. రజిత ఆత్మహత్య చేసుకునే అంత పిరికిరాలు కాదని, భర్త ఆంజనేయులు హత్య చేసి ఆత్మహత్యకు చిత్రీకరిస్తున్నాడని రజిత మృతిపై అనుమానాలు ఉన్నాయని విచారించి చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి పరశురాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అడవిదేవులపల్లి ఎస్సై వి శేఖర్ కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆందోళన సమయంలో ఎలాంటి సంఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES