- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, మాచారెడ్డి
మాచారడ్డి మండలంలోని పరిధి పెట్ గ్రామానికి చెందిన కారంగుల స్వరూప, (38) కనిపించడం లేదని, ఆమె అక్క పీర్లపల్లి రేణుక మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అనిల్ కుమార్ తలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కారంగుల స్వరూప తన భర్త అయిన సిద్ధిరాములతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్లిపోయిందని తెలిపారు. ఆమె అక్క అయినా పీర్లపల్లి రేణుక ఇచ్చిన దరఖాస్తు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ మహిళ ఆచూకీ గురించి ఎవరికైనా తెలిసినట్లయితే ఈ క్రింది నెంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు. 8712686151.
- Advertisement -