Friday, November 28, 2025
E-PAPER
Homeజాతీయంనగల దుకాణంలో చోరీకి యత్నించిన మహిళ..యజమాని చేతిలో దేహశుద్ధి

నగల దుకాణంలో చోరీకి యత్నించిన మహిళ..యజమాని చేతిలో దేహశుద్ధి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అహ్మదాబాద్‌లో ఒక నగల దుకాణంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుకాణంలో చోరీ చేసేందుకు వచ్చిన ఓ మహిళ, యజమాని కళ్లలో కారం చల్లేందుకు ప్రయత్నించింది. అయితే, అతను అప్రమత్తమై ఆమెను పట్టుకుని చితకబాదాడు. ఈ దృశ్యాలన్నీ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే… అహ్మదాబాద్‌లోని రాణిప్‌ ప్రాంతంలో సోని అనే వ్యక్తికి చెందిన బంగారం దుకాణం ఉంది. అతను షాపులో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ మహిళ లోపలికి వచ్చింది.

దుకాణంలో యజమాని తప్ప మరెవరూ లేకపోవడాన్ని గమనించిన ఆమె, చోరీకి ఇదే సరైన సమయమని భావించింది. వెంటనే తనతో తెచ్చుకున్న కారాన్ని తీసి సోని కళ్లలో కొట్టేందుకు ప్రయత్నించింది. ఆమె చర్యను క్షణాల్లో పసిగట్టిన సోని, వెంటనే ముఖం పక్కకు తిప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం తేరుకుని ఆ మహిళను పట్టుకుని గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత ఆమెను దుకాణం నుంచి బయటకు లాక్కెళ్లాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ వీడియో ఆధారంగా రాణిప్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -