Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలు, విద్యార్థులు ధైర్యంగా ఉండాలి..

మహిళలు, విద్యార్థులు ధైర్యంగా ఉండాలి..

- Advertisement -

జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంచార్జి సిఐ శంకర్
నవతెలంగాణ – తిమ్మాజిపేట
: షీటీం ఆధ్వర్యంలో జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంచార్జి సిఐ శంకర్ ఆద్వర్యంలో మంగళవారం తిమ్మాజీపేట మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, షీటీం పోక్సో చట్టం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంచార్జి సిఐ శంకర్ మాట్లాడుతూ.. మహిళలు ఉన్నత లక్షలను నిర్దేశించు కుంటు భవిష్యత్ పై కోటి ఆశలతో వారు అన్ని రంగాలలోకి అడుగుపెడుతున్నారు.

అదే సమయంలో ఇంటా బయట వారిపై నేరాలు పెరిగిపోతున్నాయి. మహిళ సాధికారతకు కిడ్నపింగ్, రేప్ లు, ఈవ్ టీజింగ్ అనేవి ప్రధాన అవరోధాలు అవుతున్నాయి. అవి స్త్రీల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తిస్తున్నాయి. వీటన్నింటికి జాగ్రత్తగా దైర్యంగా ఉండాలని జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పనిచేస్తుందని సిఐ శంకర్ వివరించారు. అలాగే సమాజంలో మహిళల శరీర అకృత్యాలు పై అస్లిల అసభ్యకర వాక్యాలు చేస్తూ వికృత ఆనందం పొందే వారు ఎక్కువై పోయారు. మహిళల గౌరవానికి ఉద్దేశ పూర్వకంగా భంగం కలిగించే మాటలేవైనా లైంగిక వేధింపుల కిందకే వస్తాయన్నారు. పని ప్రదేశాలలో బస్సులో, ఆటోలలో ప్రయాణంలో ఉన్న మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి.

ఇలా ఎక్కడి కక్కడ పాఠశాలలో కళాశాలలో కీచకులు తిష్ట వేసి ఆడపిల్లని కాల్చుకు తింటున్నారు. మహిళల పై మానసికంగా శారీరకంగా దాడులకు పాల్పడితే మహిళలు దైర్యంగా ముందుకు వచ్చి పిర్యాదు చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. ఎవరైనా దాడికి పాల్పడిన వారిపై కఠిన చేర్యాలు ఉంటాయన్నారు. ఈ మధ్య సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులు ఎక్కువగా తమ సమయాన్ని వృధా చేసుకోవడమే కాకుండా అపరిచిత వ్యక్తుల ద్వారా మోస పోతున్నారు.

ప్రత్యేకంగా ప్రధాన కూడలిలో చౌరస్తాలలో మండల జిల్లా కేంద్రాలలో షీ టీం పనిచేస్తుందని బాధితులు 100 లేదా 8712657676 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని జిల్లా షీటీం ఇంచార్జి విజయ లక్ష్మి వివరించారు. భరోసా కేంద్రం కో ఆర్డినేటర్ శ్రీలత భరోసా సేవలు, ఫోక్స చట్టం గురుంచి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమాదేవి సిసిఎస్ మెంబెర్ శేఖర్ గౌడ్ మండల విద్యాధికారి సత్యనారాయణ శెట్టి షీటీం మెంబెర్స్ వెంకటయ్య, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -