Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాజాభివృద్ధికి మహిళలు మూల స్తంభాలు

సమాజాభివృద్ధికి మహిళలు మూల స్తంభాలు

- Advertisement -

– ప్రధానోపాధ్యాయులు రఘుపతి..
నవతెలంగాణ – తుంగతుర్తి
మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు, సమాజ అభివృద్ధికి కూడా మూల స్తంభాలని, ప్రతి విజయవంతమైన కుటుంబం వెనుక ఒక మహిళ యొక్క త్యాగం, ప్రేమ, సహనం ఉంటాయని, తుంగతుర్తి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘుపతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా సోమవారం పాఠశాలలోని విద్యార్థుల యొక్క తల్లులకు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడారు.

మహిళలు విద్య, సేవాభావం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మా పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. మహిళల కోసం పలు వినోదాత్మక ఆటలు నిర్వహించగా అందులో పాల్గొన్న మహిళలు ఎంతో ఆనందంగా తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల్లో విజేతలైన మహిళలకు పాఠశాల నుండి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సిహెచ్ కళమ్మ,పి.గురువయ్య, ఎం.సూర్య ప్రకాష్, సుధాకర్ విద్యార్థుల తల్లులు శ్రావణి, రిజ్వాన, స్రవంతి, సరిత, మౌనిక, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -