Monday, December 8, 2025
E-PAPER
Homeక్రైమ్గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్న మహిళల అరెస్ట్‌

గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్న మహిళల అరెస్ట్‌

- Advertisement -

532 ప్యాకెట్లు స్వాధీనం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

నాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోని మేజర్‌బస్తీ, అఫ్జల్‌గంజ్‌ పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు మహిళలను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌) 18 ఇంచార్జి అధికారి అంజిరెడ్డి నేతృత్వంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు మహిళల వద్ద 400 గ్రాముల చొప్పున ఉన్నటువంటి 532 గంజాయి పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తూకం వేయగా 2.4 కిలోలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఉపాధ్యాయ బాలువ బాయి, కాంబ్లే గలన్‌ భారు అనే మహిళలను అరెస్ట్‌ చేశారు. ఇదే కేసులో మరో పదిమందిపై కూడా కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ రాజు, గజేందర్‌, రాజేందర్‌, రాజన్‌ అలియాస్‌ చోటు, గుణేష్‌, రాగుల్‌, జిలేబి, గున్‌గున్‌, శ్రీకర్‌ వందన, పున్నం, కాంబ్లే ఆకాష్‌ అనే నిందితులపై కేసులు నమోదు చేసి, కేసును నాంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -