రాత్రి రెండు గంటలకు క్యూ కట్టిన రైతులు..
నవతెలంగాణ – గజ్వేల్
యూరియా కొరత రైతుల మధ్య అగాధం సృష్టిస్తుంది. యూరియా కోసం సమయం ఎరగని రైతులు అర్ధరాత్రి రెండు గంటలకు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్యూ లైన్ కట్టారు. మార్కెట్లో ఉన్న డివైడర్ పై యూరియా కోసం వచ్చి కునుకు తీస్తున్నారు. రైతులు ఇంటి వద్ద వ్యవసాయ పనులకు వెళ్లి మహిళలను యూరియా కోసం గజ్వేల్ పంపిస్తే, మహిళల మధ్య యూరియా వివాదం జుట్లు పట్టుకునే వరకు వచ్చింది. అంతటితో ఆగకుండా చెప్పులు తీసి కొట్టుకున్నారు. 500 మంది రైతులకు టోకెన్లు ఇచ్చిన వ్యవసాయ అధికారులు 250 రైతులకు మాత్రమే యూరియా ఉండటంతో ఏమి చేయాలని పరిస్థితులు నెలకొన్నామి. దీంతో యూరియా దొరుకుతుందో లేదో అని వరుస తప్పి వస్తున్న మహిళల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పోలీసులు అధికారుల ముందే మహిళలు చెప్పులతో కొట్టుకున్నారు.
యూరియా కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES