Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సద్దుల బతుకమ్మ వేడుకలపై మహిళలు అయోమయం

సద్దుల బతుకమ్మ వేడుకలపై మహిళలు అయోమయం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
సద్దుల బతుకమ్మ వేడుకలపై మహిళలు తేదీలపై అయోమయానికి గురివుతున్నారు.పండితుల భిన్నప్రకటనలతో అయోమయంలో పడ్డారు. ప్రభుత్వ అధికారుల మాత్రం ఈ నెల 30న మంగళవారం సెలవు ప్రకటించారు. పండితులు చెప్పిన ప్రకారం ఈనెల 29న సోమవారం అని చెబుతున్నారు. 30న అష్టమి రోజు శాస్త్ర ప్రకారం సద్దుల బతుకమ్మ జరపాలంటున్న కొందరు పండితులు, ఈ నెల 29న వేడుకలు జరపాలంటున్న మరికొందరు పండితులు.బతుకమ్మకు 9రోజులే ప్రామాణికం..శాస్త్రం వర్తించదని వాదనలు,ఈ నెల30న సద్దుల బతుకమ్మ అంటూ ప్రభుత్వం ప్రకటించింది.

ఈనెల 30న(మంగళవారం) బతుకమ్మ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంది. ఇప్పటికే ఆరోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బతుకమ్మ ఏరోజున జరుపుకోవాలన్న సందిగ్ధంలో చాలామందిలో ఉంది.కొన్నిచోట్ల మంగళవారం తాడిచెర్లలో మాత్రం 29ననిర్వహించేందుకు మహిళలు సన్నద్ధమవుతున్నారు. ఏది ఏమైనపటికీ రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ విషయంలో స్పష్టత లేకపోవడంతో రెండుసార్లు ఒక్కోచోట ఒక్కో రోజున అలాగే 29న కొందరు, 30న మరికొందరు వేరువేరుగా నిర్వహించేలా ఆయా ప్రాంతాల ప్రజలు సిద్ధమవడం కోస మెరుపు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -