– ఎస్.ఐ కొణకంచి అఖిల
నవతెలంగాణ – అశ్వారావుపేట
మహిళలు అన్నిరంగాల్లో రాణించినప్పుడే సాధికారత సాధించినట్లు అవుతుందని,సమాజ సమగ్ర అభివృద్ధిలో మహిళల దే కీలక పాత్ర అని ఎస్.ఐ కొణకంచి అఖిల అన్నారు. భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి,స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ని పురస్కరించుకుని జరుపుకునే మైనారిటీస్ వెల్ఫేర్ డే,జాతీయ విద్యా దినోత్సవం వేడుకలను మంగళవారం తెలంగాణ మైనారిటీస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్థానిక బాలికల డిగ్రీ కళాశాల లో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ అఖిల విద్యార్ధిని లను ఉద్దేశించి మాట్లాడారు.సమయ పాలన పాటిస్తూ, క్రమశిక్షణ తో ఏరోజు చెప్పిన పాఠ్యాంశాలను అదే రోజు మననం చేసుకుంటూ, అర్ధం కాని విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటూ చదువుతూ ఉంటే ఉత్తమ ఫలితాలు సాధించ వచ్చని అన్నారు. బాలికా సంరక్షణ కోసం ప్రభుత్వాలు అనేక పధకాలను అమలు చేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుని ప్రతీ బాలికా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.



