– మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ
సర్పంచ్ రుక్మారెడ్డి
నవతెలంగాణ – ఊరుకొండ
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని.. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తుందని గుడిగానిపల్లి సర్పంచ్ అబ్దుల్ రషీద్ అన్నారు. శనివారం ఊరుకొండ మండల పరిధిలోని గుడిగానిపల్లి గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ రుక్మారెడ్డి, ఉప సర్పంచ్ జంగయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రుక్మారెడ్డి మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు తమ సమావేశాలను మరియు ఇతర కార్యకలాపాలను సొంత భవనంలో నిర్వహించుకోవడం వల్ల వారి ఆర్థిక, సామాజిక సాధికారత మరింత మెరుగుపడుతుంది.
గ్రామ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళా సమాఖ్య భవనం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ శాసనసభ్యులు అనిరుధ్ రెడ్డి సహకారంతో గుడిిగానిపల్లి గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని, ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంజలి. ఏఈ బాలరాజు, ఉప సర్పంచ్ జంగయ్య, వార్డ్ నెంబర్లు వెంకటేష్, నిరంజన్, రమేష్, కృష్ణయ్య, బంగారమ్మ, నీలమ్మ, సంగీత, గ్రామ పెద్దలు భీమని వీరస్వామి, టైగర్ జంగయ్య, శేఖర్ రెడ్డి, మాజీసర్పంచ్ కృష్ణయ్య, ప్రదీప్ గౌడ్, చీదరి ఆంజనేయులు, గోవర్ధన్ రెడ్డి, శేఖర్, తేనేటి అంజన్ రెడ్డి, మహేష్, కృష్ణ కుమార్. తదితరులు పాల్గొన్నారు.



