Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ ధ్యేయం..

మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ ధ్యేయం..

- Advertisement -

చలకుర్తి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
నవతెలంగాణ – పెద్దవూర
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగాహాలియా మున్సిపాలిటీ మార్కెట్ ఛైర్మెన్ తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం లో నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధుల సమక్షంలో అర్హత కలిగిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. మహిళా సాధికారతే తెలంగాణ ప్రగతి అనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.

మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి, కుటుంబ ఆర్థిక శ్రేయస్సును బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అందులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఒక గొప్ప ముందడుగు అని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి మంది మహిళలకు ఉచితంగా ఇందిరమ్మ చీరలు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని  తెలిపారు.ప్రతి గ్రామ పంచాయతీ, మండల కేంద్రం, మున్సిపాలిటీ కార్యాలయాల్లో నియోజకవర్గంలోని అర్హత కలిగిన ప్రతి మహిళకు చీరలు అందజేయబడతాయని ఆయన తెలిపారు. ఈ చీరలను రాజన్న సిరిసిల్ల హ్యాండ్‌లూమ్ నూలు రంగంలోనే తయారు చేయించడం వల్ల వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తోందని  తెలిపారు. తెలంగాణ చేనేత వృత్తి నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో అభినందనీయం అని ఆయన పేర్కొన్నారు.చీరల పంపిణీ సమయంలో ప్రతి మహిళా లబ్ధిదారుల వివరాలు నమోదు చేసి, భవిష్యత్ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తామని తెలిపారు.

ఇది మహిళలకు మరిన్ని పథకాల ప్రయోజనాలు అందేలా చేస్తుందని ఆయన అన్నారు. ఇందిరమ్మ చీరలు తెలంగాణ సంస్కృతికి చిహ్నమని, ఈ కార్యక్రమం ద్వారా మహిళల గౌరవం, సాంస్కృతిక గుర్తింపు మరింత వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, మహిళాశక్తి కార్యక్రమాలు, గృహలక్ష్మి,ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలతో ప్రజా ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి లలిత వెంకటరెడ్డి, బైకాని లక్ష్మయ్య యాదవ్, తుమ్మలపల్లి సుధాకర్ రెడ్డి, గగ్గనపల్లి మోహన్ రెడ్డి, పగడాల నాగరాజ్ యాదవ్ సల్లా హనుమంత రెడ్డి, గ గ్గనపల్లి సత్యం రెడ్డి, పూర్ణచంద్రరావు, గుడారి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -