Sunday, February 1, 2026
E-PAPER
Homeఖమ్మంకాంగ్రెస్ తోనే మహిళా సాధికారత 

కాంగ్రెస్ తోనే మహిళా సాధికారత 

- Advertisement -

– కమ్యూనిస్టు లకు సముచిత స్థానం 
– విజయోత్సవ సభ కూ వస్తా
– అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

కాంగ్రెస్ తోనే మహిళా సాధికారత సాధ్యం అని దీనికి మంచి ఉదాహరణ నాడు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ,నేడు నాతో పాటు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రస్తుతం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల లో మహిళా రిజర్వేషన్ లకు ప్రాధాన్యత, ప్రస్తుతం మున్సిపల్ సీట్లు కేటాయింపు లోనూ మహిళలు కే పెద్ద పీట వేయడం జరిగిందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి గా ఆమె అశ్వారావుపేట లో ఆదివారం నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కమ్యూనిస్టు లకు సముచిత స్థానం కల్పిస్తున్నామని,ఈ సంప్రదాయం నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి కొనసాగుతోంది అని గుర్తు చేసారు.పొత్తు ధర్మాన్ని పాటిస్తూ సీపీఐ (ఎం) కౌన్సిలర్ అభ్యర్థులు ను గెలిపించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వార్డుల వారీగా ప్రణాళిక ప్రకారం ఎన్నికలు ప్రచారం నిర్వహిస్తున్నారు అని తెలిపారు.ఇదే స్పూర్తి తో 22 వార్డు లు విజయం సాధిస్తాం అని తిరిగి విజయోత్సవ సభ కు వస్తానని అన్నారు. నామినేషన్ వేసిన పార్టీ ఆశావాహులు అవసరం అయితే వారి నామినేషన్ లు ఉపసంహరణ చేయాల్సి ఉంటుంది అన్నారు.

మున్సిపాలిటీ ని కైవసం చేసుకుంటాం – జారె ఆదినారాయణ 
ఆరు నూరైనా అశ్వారావుపేట మున్సిపాలిటీ తొలి పాలకవర్గం కాంగ్రెస్ దే నని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆశా భావం వ్యక్తం చేశారు.వార్డుల వారీ ప్రణాళిక తో ప్రచారం చేస్తున్నాం అని,ఒకటీ అరా వార్డు ల్లో అనుమానం ఉన్నా అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పట్టణ పేదలకు నీడ కల్పించండి – సీపీఐ (ఎం) జిల్లా నాయకులు చిరంజీవి 
మున్సిపాలిటీ అయ్యాక అశ్వారావుపేట పేదలు ఉపాధి హామీ పని కోల్పోయారని,పట్టణ పరిధిలోని పేదలకు అయినా నివాస స్థలాలు ఇచ్చి వారికి నీడ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న,మండల అధ్యక్షుడు తుమ్మ రాంబాబు, యువజన విభాగం రాష్ట్ర నాయకులు జూపల్లి వెంకటరామారావు, సీనియర్ నాయకుడు,6,13 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు జూపల్లి రమేష్ – శశికళ దంపతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -