నవతెలంగాణ- రాయపోల్
ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూస్తే ఏం లాభం లేకుండా పోయింది. అధికారులకు ప్రభుత్వానికి పలుమార్లు చెప్పిన పట్టించుకునే నాధుడే లేడు. బతుకమ్మ పండుగ అంటేనే ఆడపడుచులకు ప్రత్యేకమైన పండుగ. తొమ్మిది రోజులు ఆడపడుచులు వివిధ రంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటలతో బతుకమ్మ ఆడుతారు. అలా బతుకమ్మ ఆడుదామంటే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు బతుకమ్మ ఆడే స్థలంలో బురదమయం ఉండడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి కానీ ప్రభుత్వం కానీ శుభ్రం చేసి మహిళలకు బతుకమ్మ ఆడుకోవడానికి సిద్ధం చేస్తారని ఎదురుచూసిన లాభం లేకుండా పోయింది.
రాయపోల్ మండల కేంద్రంలో 6 వ వార్డులో బతుకమ్మలు ఆడే కామునికంతలో వర్షం నీరు నిలిచి బురదమయంగా ఉండడంతో మొదటి రోజు బతుకమ్మ ఆడడానికి మహిళలు ఇబ్బంది పడ్డారు. అది చూసి సోమవారం కాలనీలోని మహిళలు ముందుకు వచ్చి వారే సొంత నిధులతో ఎడ్లబండి సహాయంతో డస్ట్, సిమెంట్ తీసుకొచ్చుకొని సీసీ వేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి వరద నీరు లేకుండా శుభ్రం చేస్తాడు అనుకుంటే ఎవరు పట్టించుకోవడంలేదని, మేమే బతుకమ్మ ఆడుకోవడానికి సౌకర్యవంతంగా మేమే సిసి వేసుకుంటున్నామని మహిళలు తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీ నుంచి వీధిలైట్లు కానీ, గడ్డి, వరద నీరు, బురద లాంటివి ఏమున్న శుభ్రం చేసి మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి సిద్ధంగా ఏర్పాట్లు చేసేవారు. ఈసారి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని మహిళలు వాపోయారు.
బతుకమ్మ ఆట కోసం నడుం బిగించిన నారీమణులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES