నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులను స్థానిక మహిళా సంఘాల సభ్యులు ఆదివారం ఘనంగా సత్కరించారు. గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు బట్టు బాలహంస ఆధ్వర్యంలో సర్పంచ్ కంపదండి అశోక్, ఉప సర్పంచ్ ఉల్లెంగుల శశిధర్, వార్డు సభ్యులు బసిరి సురేష్, చిడబోయిన మధు, బాసకొండ దేవేందర్, మామిడి ఆమని, ఈర్నాల లక్ష్మి, రాథోడ్ జ్యోతి లను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కంపదండి అశోక్ మాట్లాడుతూ గ్రామంలో మహిళా సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి పాలకవర్గం ఎప్పుడు సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు బట్టు బాలహంస, కంపదండి మాధవి, రావుట్ల లత, అచ్చ గంగజల, మామిడి ఆమని, ఐకెపి సీసీ అలేఖ్య, వివోఏ సుభాష్, మహిళ సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ పాలకవర్గం సభ్యులను సత్కరించిన మహిళలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



