Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఐయూఎంఎల్‌ జాతీయ నాయకత్వంలో మహిళలు

ఐయూఎంఎల్‌ జాతీయ నాయకత్వంలో మహిళలు

- Advertisement -

తిరువనంతపురం: ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ (ఐయూఎంఎల్‌) తొలిసారిగా ఇద్దరు మహిళలను జాతీయ నాయకత్వం లో నియమించింది. వీరిలో ఒకరు హిందూ దళిత మహిళ. కేరళ రాజకీయాలలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఐయూఎంఎల్‌ ఈ నిర్ణయం తీసు కుంది. అంతేకాక ప్రగతిశీల పక్షంగా తమ ఇమేజ్‌ని పెంచుకోవడం కూడా దీని వెనుక ఉన్న ఉద్దేశం. కేరళకు చెందిన జయంతి రాజన్‌, తమిళనాడుకు చెందిన స్థానిక కౌన్సిలర్‌ ఫాతిమా ముజఫర్‌లకు పార్టీ జాతీయ కమిటీలో సహాయ కార్యదర్శులుగా స్థానం కల్పించారు. చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజన్‌ వాయనాడ్‌ జిల్లాకు చెందిన ఓబీసీ నాయకురాలు కాగా ఫాతిమా చెన్నై ఎగ్మోర్‌లోని ఓ వార్డుకు కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad