Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోరింటాకు సందడిలో మహిళలు.!

గోరింటాకు సందడిలో మహిళలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : ఆషాడ మాసం పురస్కరించుకొని శనివారం మండల కేంద్రమైన తాడిచర్ల తోపాటు అన్ని గ్రామాల్లో గోరింటాకుతో మహిళలు సందడి చేశారు. ఈ సందర్భంగా మహిళలు అందరికీ పండుగ వాతావరణంలో గోరింటాకు పెట్టుకున్నారు. గోరింటాకు చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుందని, ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. గోరింటాకు అనేది సాంప్రదాయకంగా, సౌందర్య సాధనంగా, అలాగే ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు కలిగి ఉంది. గోరింటాకు జుట్టుకు బలాన్ని ఇవ్వడానికి, చుండ్రును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆషాడ మాసంలో గోరింటాకు అలంకరణ తెలుగు వారి సంప్రదాయమని పలువురు మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -