- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మహిళల చట్టాలపై బాలికలు, విద్యార్థినిలు అవగాహన కలిగి ఉండాలని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర అన్నారు. మంగళవారం కేజీబీవీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అవగాహన కల్పించారు. అదేవిధంగా పోలీసు కళాబృదం వారు కళల ద్వారా మహిళలకు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర, పోలీసు సిబ్బంది, పోలీసు కళా బృందాల వారు, కేజిబివి విద్యార్థినిలు, ఉపాధ్యాయునిగా బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



