Monday, September 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

- Advertisement -

మహిళలు అభివృద్ధి కాకుండా సమాజం వృద్ధికాదు : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ

నవతెలంగాణ-సంగారెడ్డి
మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో శ్రామిక మహిళా జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ.. మహిళలు అన్ని విభాగాల్లో ముందున్నా తగిన గుర్తింపు లేదన్నారు. పనికి తగ్గ వేతనాలు చెల్లించడం లేదని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలంటే చిన్నచూపు ఉంటుందని, ఒకేచోట ఒకే పని చేసినా వివక్షత ఉంటుందని అన్నారు. మహిళల రక్షణకు అనేక చట్టాలున్నా అవి అమలుకావడం లేదని, వాటిపై మహిళలకు ప్రభుత్వం, అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు అభివృద్ధి కాకుండా సమాజం అభివృద్ధి కాదని తెలిపారు. మహిళలు పనిచేసే చోట అనేక సౌకర్యాలు కల్పించాలని, వివక్షత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్కీమ్‌ వర్కర్స్‌ను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26000 అమలు చేయాలని, చట్టపరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సదస్సులో సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు బి. మల్లేష్‌, జి సాయిలు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ పి.మంగ, నాయకులు యాదగిరి, సువర్ణ, శశికళ, అశ్విని, యాదమ్మ, అమత, ఏసుమని, నిరాజ, ప్రశాంతి, గంగ, గౌరమ్మ, విజయలక్ష్మి, షేకమ్మ, ప్రసన్న లక్ష్మీ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -