Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..

- Advertisement -

దోమకొండ కోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జి
నవతెలంగాణ – భిక్కనూర్
మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీపడి రాణించాలని దోమకొండ కోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జి  తెలిపారు. మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్న తెలంగాణ సౌత్ క్యాంపస్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ట్రస్టు ఆధ్వర్యంలో మహిళ విద్యార్థులు, అధ్యాపకులకు ఏర్పాటుచేసిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం దోమకొండ కోట ట్రస్ట్ మేనేజర్ మాట్లాడుతూ పురుషులతో పోటీపడి సమానత్వం సాధించాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్, ఉమెన్స్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ వైశాలి, హాస్టల్ వార్డెన్ సునీత, ఏపీఆర్ఓ సరిత, అధ్యాపకులు అంజయ్య, హరిత, రాజు, ప్రతిజ్ఞ, రమాదేవి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad