నవతెలంగాణ – ధర్మసాగర్
మహిళలు అన్ని రంగాలలో రాణించి, అభివృద్ధిలోనికి రావాలని డిపిఎం దయాకర్ అన్నారు. గురువారం మండలంలోనిక్యాతంపల్లి గ్రామంలో శ్రీరామాంజనేయ వివో సి జి జి సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నమెంట్, ఎస్ ఇ ఆర్ పి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పౌల్ట్రీ సంబంధించి 14 మంది టీం గా రావడం జరిగింది. ఆశిష్,రామ్ టీం లీడర్ గా గ్రామ సంఘం పనితీరు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యుల తో సభ్యుల యొక్క లోన్ ట్రాన్సాక్షన్స్ లోన్ వినియోగాలు గురించి తెలుసుకోని,ఎంటర్ప్రైజెస్ యాక్టివిటీస్, లేబులింగ్ బ్రాండింగ్ పరిశీలించారు.
మీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న పారిశ్రామికులుగా ఎదగాలని,క్యాతంపల్లి గ్రామం నుండి 15మంది సభ్యులకు ఎస్ ఇ ఆర్ పి ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ 30 రోజులు ఇవ్వగా తదుపరి శిక్షణ పొందిన వారికి టైలరింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిసిసి, టి జి బి బ్యాంక్ ను సంప్రదించడం జరిగింది. హనుమకొండ డి ఆర్ డి ఏ, డిఆర్డిఓ, ఐబి, డిపిఎం దయాకర్, ఏపీఎం దేవానంద్, సీసీ లు దానయ్య,సంపదయ్య, సి జి జి టీమ్ రాము,ఆశిష్,మీనాక్షి,హరిత్,శ్రీజ, సాహిత్య,దేవిజా,అమృత,భవాని శంకర్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES