Tuesday, January 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఏపీఎం జి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సహజ్యోతి మండల సమైక్య కార్యాలయంలో మండలంలోని నూతనంగా ఎన్నికైన మహిళా సర్పంచులకు ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయం సహాయక సంఘాల నుండి చైతన్యం పొంది పురుషులతో సమానంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు గంగ సాగర, కార్యదర్శి కనక సరోజా, సర్పంచులు, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -