Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..

- Advertisement -

కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ
నవతెలంగాణ – మల్హర్ రావు

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు,కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కొయ్యుర్ లో కేక్ కట్ చేసి ఘనంగా మహిళ దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజమ్మ మాట్లాడారు. మార్పు అనేది ఇంటినుంచే ప్రారంభం కలవాలన్నారు. పురుషుల కంటే స్త్రీలు అందులోనూ తక్కువ కాదన్నారు.అబ్బాయిలు,అమ్మాయిలను సమానంగా పెంచాలన్నారు. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందించే ప్రతిపలాలను అందిపుచ్చుకునేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కొండూరి మమత, అంగన్ వాడి టీచర్ గడ్డం పద్మ, సారక్క, రజిత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -