వడ్డీ లేని రుణాలను ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలి
బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్
బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సి సి, శ్రీనివాస్
నవతెలంగాణ – నెల్లికుదురు
స్వయం సహాయక సంఘాల సభ్యుల మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ ఆ గ్రామ సిసి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో గురువారం శ్రీ వెంకటేశ్వర గ్రామైక్య సంఘం మరియు బాలాజీ గ్రామైక్య సంఘం సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ గ్రామంలోని మహిళలు ఐక్యతగా ఉండి ప్రతి మహిళ లక్షాధికారిగా ఎదగాలని అన్నారు. వడ్డీ లేని రుణాలను ప్రతి మహిళా సభ్యులు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చిరు వ్యాపారకు లోన్లు కూడా ఇస్తుందని అన్నారు. ప్రతి మహిళ ప్రతినెల పొదుపు చేసుకొని తీసుకున్నటువంటి రుణాలను రెగ్యులర్గా ప్రతి నెల చెల్లించాలని తెలిపారు.
వివో సమైక్య భావన నీకి స్థలం కేటాయింపు: సర్పంచ్ యాకాంతం గౌడ్
బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో మహిళ సమైక్య భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినట్లు ఆ గ్రామ సర్పంచ్ యాకాంతం గౌడ్ తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఉన్నంత స్థాయికి ఎదడానికి ఎప్పటికీ నా వంతు సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం ఆ గ్రామ సర్పంచ్ యాకాంతం గౌడ్ కి. మరియు సీసీ శ్రీనివాస్ కి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు మహిళా సంఘం సభ్యులు తెలిపారు. స్థలాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర గ్రామైక్య సంగం అధ్యక్షురాలు తాళ్ళ సునీత., కోశాధికారి పెరుమాండ్ల రామ తార పద్మ, సాయి బాలాజీ గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు పెరమళ్ళ సమ్మక్క, సి ఏ లు చింతకుంట్ల ఉపేందర్, అక్కెర ఉషారాణి, మరియు వివిధ గ్రామ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు.



