Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలు ధృఢ సంకల్పంతో ఎదగాలి 

మహిళలు ధృఢ సంకల్పంతో ఎదగాలి 

- Advertisement -

మండల పంచాయతీ అధికారి: మమత
నవతెలంగాణ – గోవిందరావుపేట 

మహిళలు దృఢ సంకల్పంతో అన్ని రంగాలలో ఎదగాలని మండల పంచాయతీ అధికారి ఎం మమత అన్నారు. శనివారం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవ తెలంగాణతో మాట్లాడారు. ముందుగా మండల ప్రజానీకానికి జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

నేటి వ్యవస్థలో కుటుంబం గానీ వ్యవస్థ గాని ఆర్థికంగా బలపడాలంటే మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుకు వస్తేనే సాధ్యపడుతుంది. విద్యార్థి దశ నుంచే పిల్లలు ఇప్పుడు ఫలితాలలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఉద్యోగ రంగంలో కూడా మహిళలు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ రాణిస్తూ కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తున్నారు. ఒకప్పుడు తండ్రి సంపాదించి ఆదాయం మీద మాత్రమే కుటుంబాలు ఆధారపడేవి.

ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కుటుంబంలో మహిళలు కూడా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. ఈ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇది కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ప్రతి కుటుంబంలో ఇప్పుడు ఆడపిల్లలను కూడా సమానంగా చూసుకుంటున్నారు. మహిళా సాధికారతకు ఇది ఒక నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిని సాధించిన మహిళలలను వారి పరిస్థితులు విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు ప్రయాణించాలి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -