Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కస్తూర్బాలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

కస్తూర్బాలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
చదువులతల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను పురస్కరించుకుని మండలంలోని దుబ్బపేట గ్రామపరిదిలో ఉన్న కస్తూర్బా గాంధీ ఆశ్రమ బాలికల విద్యాలయంలో శనివారం మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగిందని పాఠశాల స్పెషల్ అధికారి (ఎస్ఓ) భవాని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలు అయినటువంటి సుజాత టీచర్  ఫిజికల్ సైన్స్,పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయురాలు అయినటువంటి రాధిక టీచర్, తెలుగు ఉపాధ్యాయురాలని గత 12 సంవత్సరాలుగా సేవలందిస్తున్న వీరి సేవలను గుర్తించి ఉపాధ్యాయు రాళ్లను, నాన్ టీచింగ్,విద్యార్థినుల సమక్షంలో ఇరువురికి శాలువాలతో సత్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాళ్లు,విద్యార్థునిలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -