నవతెలంగాణ – డిచ్ పల్లి
నేడు ఈ రంగం చూసిన మహిళ మనులే అధికంగా ముందుండి రాణిస్తున్నారని రాబోవు రోజుల్లో వారు మరింత రాటు తేలుతారని మండల విద్యాశాఖ అధికారి ఎస్ గాయత్రి పేర్కొన్నారు. బుదవారం ఇందల్ వాయి మండలంలోని గన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారిని ఎస్ గాయత్రి ఆధ్వర్యంలో అధ్యాపకులకు, సర్పంచ్ , పాఠశాలలు పనిచేసే సిబ్బందికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారిని గాయత్రి మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. నిజ జీవితంలో మహిళల శక్తి, సామర్థ్యాలు వారు సాధిస్తున్న విజయాలను వివరించి విద్యార్థులకు ప్రేరణనిస్తున్నట్లు వివరించారు.
అద్యాపకులను సన్మానించడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు ఇందల్ వాయి మండల అధ్యక్షులు భార్గవ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు విజయకుమార్, బిసిటియు జిల్లా అధ్యక్షులు వినోద్, మండల అధ్యక్షులు గంగా మోహన్, తపస్ జిల్లా అధ్యక్షులు గంగా ప్రసాద్, ఎస్సీ ఎస్టీ యూనియన్ అధ్యక్షులు గంగాధర్ తోపాటు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు చెందిన మహిళ అధ్యాపకులు పాల్గొన్నారు.



