- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా సమాఖ్యలకు సొంత భవనాలను నిర్మించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. అధికారులు 200 గజాల స్థలాన్ని గుర్తించి నెలాఖరులోగా శంకుస్థాపన చేయాలని ఆదేశించింది. ఒక్కో భవనాన్ని రూ. 10 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించాలని సూచించింది. సమావేశాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు ఇవి ఉపయోగపడనున్నాయి. కాగా డ్వాక్రా సంఘాల్లో 63L మంది సభ్యులున్నారు.
- Advertisement -



