Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ స్టేషన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

పోలీస్ స్టేషన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు 
ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో పోలీస్ సిబ్బంది ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. మహిళా కానిస్టేబుల్స్ రామదేవి, స్వాతి విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్నారని సీఐ ఆర్ సంతోష్ ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో సత్కరించారు.పోలీస్ స్టేషన్‌ లో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది పాల్గొని మహిళా శక్తిని గుర్తించుకున్నారు.

సర్కిల్ ఇన్స్పెక్టర్, సిబ్బంది సంయుక్తంగా మహిళల సాధికారత, సేవా దైవత్వాన్ని ప్రశంసించారు. మహిళల పాత్రను సమాజం ముందుంచి, వారి సేవలకు గౌరవం అర్పించారు.రామదేవి, స్వాతి అంకితభావంతో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నారని సీఐ సంతోష్ తెలిపారు. ఈ సత్కారం వారి ఉత్సాహాన్ని మరింత పెంచుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్సైలు తిరుపతి, సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -