Monday, March 9, 2026
E-PAPER
Homeజిల్లాలునెల్లికుదురులో ఘనంగా మహిళా దినోత్సవం

నెల్లికుదురులో ఘనంగా మహిళా దినోత్సవం

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మండల నాయకురాలు హెచ్ అలివేలు
నవతెలంగాణ – నెల్లికుదురు

మహిళా దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని మండల కేంద్రంలో వివిధ శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి వారికి శాలువతో ఘనంగా సత్కరించినట్లు కాంగ్రెస్ పార్టీ మండల మహిళా నాయకురాలు హెచ్ అలివేలు తెలిపారు. శనివారం పోలీసు శాఖలో మరియు స్థానిక పీహెచ్సీలో మరియు గ్రామపంచాయతీ సిబ్బంది మహిళలకు ఐకెపి మహిళలకు శుభాకాంక్షలు తెలిపి మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..మహిళలు ఆర్థికంగా రాజకీయంగా విద్య వైద్య ఆరోగ్య పోలీసు శాఖలతోపాటు వివిధ శాఖలో మహిళల ముందు ఉండాలని అన్నారు. మహిళలు అన్ని రంగాలుగా రాణించాలని ఈ సందర్భంగా వారికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి కోసం ఎంతగానో సీఎం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రతి మహిళా లక్షాధికారిగా ఎదగాలని ఉద్దేశంతో మహిళ అభివృద్ధికి పెద్దపీట కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ పులి వెంకన్న ఉప సర్పంచ్ తో పటు వార్డు సభ్యులు వివిధ శాఖల విధులు నిర్వహిస్తున్న మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -