నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నారాయణ స్కూల్, సుభాష్ నగర్ బ్రాంచ్, నిజామాబాద్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం స్కూల్ ఆడిటోరియంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. మహిళల సాధికారత, సమానత్వం , సమాజంలో వారి పాత్రపై ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మేయర్ కురగాయల ఉమా రాణి హాజరై విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలను గౌరవించడం , వారికి సమాన అవకాశాలు కల్పించడం సమాజ అభివృద్ధికి అవసరమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన స్కూల్ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. అతిథులుగా ఎస్‌ఐ బి. సుమలత , దారం సౌమ్య , ఏజీఎం సూర్యవంశీ శివాజీ పాల్గొని మహిళల శక్తి, భద్రత , సమాజ నిర్మాణంలో వారి పాత్రపై ప్రేరణాత్మక సందేశాలు అందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మహిళల గొప్పతనాన్ని ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు , వివిధ ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది. అదేవిధంగా, ఈ సందర్భంలో హోళీ పండుగను ఉపాధ్యాయులు , విద్యార్థులు ఆనందంగా జరుపుకున్నారు. రంగుల పండుగ అయిన హోళీ ఐక్యత, ఆనందం , స్నేహభావాన్ని ప్రతిబింబించింది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ జి. చందన, నారాయణ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



