సీఎం హాజరయ్యే అవకాశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మహిళా జర్నలిస్టులతో మార్చి ఎనిమిదో తేదీన ఉమెన్స్ డే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సన్నాహాలు చేస్తున్నది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఈ కార్యక్రమం చేపట్టను న్నారు. నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ మహిళా జర్నలిస్టులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సభను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనికి సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు, మీడియా అకాడమీ చైర్మెన్ కె శ్రీనివాస్‌రెడ్డితోపాటు సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక హాజరు కానున్నారు. మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. ఇతర ప్రత్యేక కార్యక్రమాలు సైతం చేపట్టేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది.
మార్చి 8న ప్రజాభవన్‌లో..మహిళా జర్నలిస్టులతో ‘ఉమెన్స్ డే’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



