Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మహిళల అభివృద్ధి సమాజ అభివృద్ధికి స్ఫూర్తి 

మహిళల అభివృద్ధి సమాజ అభివృద్ధికి స్ఫూర్తి 

- Advertisement -

మహిళల ఆర్థిక స్వావలంబనే  ధ్యేయంగా చేయూత 
ప్రతి మహిళ ఆర్థిక ప్రగతిని సాధించాలి 
ఆర్బిఐ జనరల్ మేనేజర్ ఎం జి సుప్రభాత్ 
నవతెలంగాణ – పాలకుర్తి

మహిళల అభివృద్ధి సమాజాభివృద్ధికి స్ఫూర్తినిస్తుందని ఆర్బిఐ జనరల్ మేనేజర్ ఎం జి సుప్రభాత్ మహిళలకు సూచించారు. సంతృప్త ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం భీమ పథకాలను ప్రజలకు చేరవేయడంతోపాటు కేవైసీని అప్డేట్ చేయించుకునేందుకు శనివారం మండల కేంద్రంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మండపంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేంద్రన్ తో కలిసి మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థిక స్వలంబన సాధించడమే ధ్యేయంగా బ్యాంకులు పనిచేస్తున్నాయని తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా, ఆర్థికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి మహిళ ఆర్థిక ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సురక్ష భీమా యోజన, జీవనజ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరు కేవైసీ అప్డేట్ చేయించుకోవాలని తెలిపారు. బ్యాంకు లింకేజీ ద్వారా అప్పు పొందే మహిళలు క్రమం తప్పకుండా రుణాలు చెల్లించుకోవాలని సూచించారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు పరిధిలోగల 33 మహిళా సంఘాలకు నాలుగు కోట్ల రూపాయలను మంజూరు చేసామని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వాలంబన సాధించాలని, సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ సర్కిల్ హెడ్ సుజిత్ కుమార్ జా, డి ఆర్ డి ఓ పి డి వసంత, ఏపీ డి నూరొద్దీన్, పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ ఆడెపు రమేష్, డిపిఎం శ్రీనివాస్, ఏపీఎం శ్రీరాముల చంద్రశేఖర్ లతోపాటు సీసీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad