యుఏఈ నుంచి మొరాకోకు మార్చిన ఫిఫా
దుబాయ్ : ఫిఫా యునైట్స్ పేరిటి నిర్వహిస్తున్న మహిళల ఫుట్‌బాట్ టోర్నమెంట్ వేదిక యుఏఈ నుంచి మొరాకోకు మారింది. యుఏఈ, చాద్, లిబియా సహా అఫ్గనిస్తాన్ మహిళల జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి. ఈ నెల 23 నుంచి 29 వరకు దుబాయ్ లో జరగాల్సిన ఈ టోర్నమెంట్ వేదికను ఫిఫా ఆఖరు నిమిషంలో మార్పు చేసింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు మొరాకోలో మహిళల సిరీస్ జరుగుతుందని ఫిఫా వెల్లడించింది. 2021లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మహిళలను క్రీడల నుంచి నిషేధించారు. వేధింపులు, కఠిన శిక్షల భయంతో అఫ్గాన్ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణీలు విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అఫ్గాన్ ఉమెన్ యునైటెడ్ పేరుతో ఈ టోర్నమెంట్‌లో అఫ్గనిస్తాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు పోటీపడనుంది.



