Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గానుగుబండలో స్త్రీనిధి నిధులు గోల్ మాల్

గానుగుబండలో స్త్రీనిధి నిధులు గోల్ మాల్

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సున్నా వడ్డీకి సమభావన సంఘాలకు రుణాలు మంజూరు చేస్తోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామానికి చెందిన విబికె భూపతి సైదులు,రూ.30లక్షలు సొంత అవసరాలకు వాడుకున్నాడని, సమభావన సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత మహిళలు శనివారం వెల్లడించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గానుగుబండ  గ్రామంలో 36 సమభావన సంఘాలు ఉన్నాయి.వీటిలో 22 సంఘాలకు విబికె భూపతి సైదులు 2023లో వడ్డీ లేని పథకం ద్వారా బ్యాంకు నుంచి రూ.80 లక్షల రుణాలను మండల స్త్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్‌ మధుకర్ ద్వారా ఇప్పించారు.

రుణాలు తీసుకున్న సభ్యులు ప్రతి నెలా విబికె ద్వారా బ్యాంకుకు నగదు చెల్లిస్తున్నారు.సంఘం సభ్యుల నుంచి తీసుకున్న నగదును, విబికె సైదులు బ్యాంకులో కొంతే జమచేసి,ఎక్కువ మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకున్నట్లు తెలిపారు. ఇటీవల పలువురు సంఘాల సభ్యులు బ్యాంకు సిబ్బందిని సంప్రదించి,తాము విబికెకి చెల్లించిన నగదు పూర్తి స్థాయిలో రుణ ఖాతాల్లో జమకావడంలేదని తెలుసుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఉన్న సంఘాల లీడర్లు,సభ్యులు,ఈతతంగoపై సైదులును నిలదీశారు. సుమారు రూ.30లక్షలను దారి మళ్లించి తన సొంత ఖర్చులకు వాడుకున్నాడని,సమభావన సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు.

శనివారం గ్రామానికి చెందిన ఒక సంఘం సభ్యులు 2023 లో 4 లక్షల తీసుకొని కాలపరిమితి పూర్తి అయిందని,వారు పూర్తి అమౌంట్ చెల్లించిన బ్యాంకులో రూ.1,50,000  మాత్రమే జమచేసి మిగతా రూ.2,50,000 సైదులు వాడుకున్నట్లు కార్యాలయంలో తెలిపారని అన్నారు.గ్రామంలోని అన్ని గ్రూపుల పరిస్థితి ఇదే అని ఆరోపించారు.గ్రామంలోని 22 సంఘాల సభ్యుల నుండి దాదాపు 30 లక్షలకు పైగా సొంత అవసరాలకు వాడుకున్నాడని గ్రామ మహిళా సంఘాల గ్రూపు సభ్యులు ఆరోపిస్తున్నారు.అక్రమాలకు పాల్పడిన విబికె పై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం చేయాలంటూ సంఘాల సభ్యులు ఏపీఎంకు వినతిపత్రం అందజేసి వేడుకుంటున్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఏపీఎం యాదమ్మ
గానుగుబండ గ్రామంలో స్త్రీనిధి నిధులను విబికె  బ్యాంకులో చెల్లించకుండా సొంతానికి వాడుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌(ఏపీఎం)యాదమ్మ తెలిపారు. స్త్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్‌, సీసీల పర్యవేక్షణలో రుణాలు తీసుకున్న సంఘాల సభ్యులతో విచారణ చేసి, నిధులు దుర్వినియోగం చేసిన విబికె పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -