Friday, March 20, 2026
E-PAPER
Homeక్రైమ్మహిళా సంఘాల రుణాలు గోల్ మాల్!

మహిళా సంఘాల రుణాలు గోల్ మాల్!

- Advertisement -

నోటీసులతో బయటపడుతున్న వైనం

ఆర్పిల పాత్ర పై అనుమానాలు

నవతెలంగాణ – భువనగిరి

భువనగిరి మహిళా సంఘాల తీసుకున్న రుణాల విషయంలో, తిరిగి చెల్లించే విషయంలో రూ.లక్షలు గోల్ మాల్ అయినట్టు సమాచారం. ఈ గోల్ మాల్ అవినీతి నిజానిజాలు తేల్చడానికి మున్సిపల్, మెప్మాలు, పోలీసు అధికారులు బ్యాంకు అధికారుల దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. భువనగిరి పట్టణంలోని కెనరా బ్యాంకు మహిళా సంఘాలకు రుణాలు అందజేసింది. మహిళా సంఘాలను సజావుగా నడవడానికి ఆర్పీలు, ఆరిపీలపై మెప్మా అధికారులు పర్యవేక్షణ ఉంటుంది. పర్యవేక్షణ ఉన్నప్పటికీ బ్యాంకు రుణాల విషయంలో సరైన విధంగా మహిళా సంఘాల సభ్యులకు అందలేదు. సకాలంలో బ్యాంకులు రుణాలు తీసుకొని చెల్లించకపోవడంతో ఆ సంఘాలకు సంబంధించిన సుమారు 30 సంఘాలకు రుణాలు సకాలంలో కట్టనందున నోటీసులు అందజేసినట్లు తెలిసింది.

రుణాలు తీసుకున్న వారు ఎందుకు కట్టడం లేదని నోటీసులతో పాటు అధికారులు ఫీల్డ్ మీదికి వెళ్లారు. దీంతో ఈ సంఘాలలో కొన్ని సంఘాలు డబ్బులు తీసుకోలేదని, మరికొందరు డబ్బులు తీసుకుని రెగ్యులర్ గా కడుతున్నామని బ్యాంకు అధికారులకు వివరించినట్లు తెలిసింది. చాలాకాలంగా డబ్బులు చెల్లించని రుణ గ్రహీతల ఇండ్ల వద్దకు బ్యాంకు అధికారులు రెండు రోజులుగా వెళుతూ వివరాలు సేకరిస్తున్నారు. హనుమాన్ వాడ, గార్లపాటి జగ్గయ్య నగర్ లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మెప్మా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. మహిళా సంఘాల లీడర్లు ఆర్పీలు కలిసి ఏమైనా అవినీతికి పాల్పడ్డారా అనే విషయాలను చర్చిస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్, మెప్మా, పోలీసు బ్యాంకు అధికారులు విచారణ జరుపుతున్నారు. కెనరా బ్యాంకులో డబ్బులు చెల్లింపు విషయంలో తమ మహిళా సంఘం పేరుతో తీసుకున్న రుణాల డబ్బులు ఆర్పీలు సకాలంలో బ్యాంకులో కడుతున్నారా లేక ఆర్పీలు వాటిని వాడుకున్నారా అనే విషయంపై మహిళా సంఘాల గ్రూపు లీడర్లు సభ్యులు ఆరా తీస్తున్నారు. భువనగిరి పట్టణంలో ప్రస్తుతం ఒక సంచలన వార్త.

విచారణ జరుపుతున్నాము: మితిన్ రాజ్, బ్యాంకు మేనేజర్

బ్యాంకులో రుణాలు తీసుకొని ఆ రుణాలను సకాలంలో చెల్లించని మహిళా సంఘాల పై విచారణ జరుపుతున్నాం. కొందరు తమ రుణాలు సకాలంలో చెల్లిస్తున్నామని తెలియజేస్తున్నారని దీనిపై సోమవారం పూర్తి వివరాలు తెలుసుకొని సమాచారం అందిస్తామన్నారు. మహిళా సంఘాల రుణాలు సకాలంలో చెల్లించకుండా ఆర్పీలు సొంతానికి వాడుకుంటే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను రికవరీ చేస్తామని వివరించారు.

ఒకరిద్దరి ఆర్పిలపై అనుమానాలు!

భువనగిరి మున్సిపల్ పరిధిలోని ఆర్పీలు, కెనరా బ్యాంక్ రుణాలు తీసుకొని మహిళా సంఘాలకు ఇవ్వకుండా, తీసుకున్నవారు రెగ్యులర్ చెల్లింపులు చేసిన వాటిని బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రెండు కోట్లు అని, మరికొందరు మూడు కోట్లు అని సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. విచారణలో అవినీతి తేలితే బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు అవినీతికి కారకులైన వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: మెప్మా డీఎంసీ రమేష్.

మహిళా సంఘాల సభ్యుల రుణాల విషయంలో అవకతవకలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై  పూర్తిస్థాయి విచారణ చేసి శాఖపరంగా చర్యలు తీసుకుంటామని మెప్మా జిల్లా డిఎంసి రమేష్ తెలిపారు. విచారణ లో తేలిన విషయాలని ఉన్నత అధికారులకు తెలియజేసి వారి సూచన మేరకు చర్యలు ఉంటాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -