Thursday, November 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా కబడ్డీ వరల్డ్‌ కప్‌

మహిళా కబడ్డీ వరల్డ్‌ కప్‌

- Advertisement -

రెఫరీగా శ్రీను నాయక్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రెండవ ఉమెన్స్‌ కబడ్డీ వరల్డ్‌ కప్‌ ఇంటర్నేషనల్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (రెఫరీ)గా హైదరాబాద్‌ జిల్లా చాంద్రాయణగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ వి.శ్రీను నాయక్‌ ఎంపికయ్యారు. బంగ్లాదేశ్‌ ఢాకాలో నవంబర్‌ 17 నుంచి 24 వరకు వరల్డ్‌ కప్‌ పోటీలు జరగనున్నాయి. కబడ్డీ ఈవెంట్‌కు ప్రభుత్వ పాఠశాల నుంచి ఎంపికైన తొలి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ శ్రీను నాయక్‌. ఈ సందర్భంగా పాఠశాల విద్య సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ శ్రీను నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీను నాయక్‌కు అవకాశం రావడం ఆయనకు వ్యక్తిగతంగానే కాకుండా విద్యాశాఖకే గర్వకారణమని అభివర్ణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -