ఈ ఏడాది ఆఖర్లో నిర్వహణకు అవకాశం
నవతెలంగాణ-హైదరాబాద్ :
మహిళల కబడ్డీ ప్రపంచకప్ మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది జూన్‌లో బిహార్‌లో జరగాల్సిన ప్రతిష్టాత్మక టోర్నమెంట్ పలు కారణాలతో వాయిదా పడింది. దీంతో ఆగస్టు 3-10న హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకెఎఫ్‌ఐ) నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్‌లో పోటీపడేందుకు ముందుగా నిర్ణయించిన దేశాల కంటే అధికంగా ఎంట్రీలు రావటంతో పలు సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు సమాచారం. దీంతో మహిళల కబడ్డీ ప్రపంచకప్ మళ్లీ వాయిదా పడింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్‌కు ఏకెఎఫ్‌ఐ లేఖ రాసింది. అర్జెంటీనా, బంగ్లాదేశ్, చైనీస్ తైపీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఇరాన్, జపాన్, కెన్యా, నేపాల్, థారులాండ్, ఉగాండా, జాంజిబార్, పొలాండ్, భారత్ సహా 14 దేశాలు ఈ టోర్నమెంట్‌లో పోటీపడాల్సి ఉంది. భారత్‌లో కబడ్డీ పండుగ ప్రో కబడ్డీ లీగ్ (పీకెఎల్) ఆగస్టు 29 నుంచి షురూ కానుంది. పీకెఎల్ ముగిసిన తర్వాత ఈ ఏడాది ఆఖర్లో మహిళల ప్రపంచకప్ నిర్వహణకు అవకాశం ఉంది.
మహిళల కబడ్డీ ప్రపంచకప్ మళ్లీ వాయిదా
- Advertisement -
- Advertisement -