Monday, April 13, 2026
E-PAPER
Homeఆటలుమ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌..భారీగా ప్రైజ్‌మ‌నీ పెంపు

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌..భారీగా ప్రైజ్‌మ‌నీ పెంపు

- Advertisement -

న‌వ‌తెలంగాన‌-హైద‌రాబాద్: ఈ ఏడాది జూన్‌లో మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్(Womens T20 World Cup) నేప‌థ్యంలో ఇవాళ ఐసీసీ ప్రైజ్‌మ‌నీ ప్ర‌క‌టించింది. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో విజేత‌ల‌కు అంద‌జేసే ప్రైజ్‌మ‌నీని రికార్డు స్థాయిలో పెంచేసింది. రెండు నెల‌ల పాటు ఇంగ్లండ్‌, వేల్స్‌లో జ‌రిగే వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం సుమారు 82 కోట్ల ప్రైజ్‌మ‌నీ ప్ర‌క‌టించింది ఐసీసీ. గ‌త వ‌రల్డ్‌క‌ప్‌లో ప్రైజ్‌మ‌నీ 74 కోట్లు కాగా, ఈసారి 82 కోట్లు ఇవ్వ‌నున్నారు. గ‌త ఎడిష‌న్‌తో పోలిస్తే సుమారు 10 శాతం ప్రైజ్‌మ‌నీ పెంచారు. ఈసారి ఈ టోర్నీలో మొత్తం 12 జ‌ట్లు పాల్గొన‌నున్నాయి. 2024లో కేవ‌లం 10 జ‌ట్లు మాత్ర‌మే పాల్గొన్నాయి. జూన్ 12 నుంచి జూలై 5వ తేదీ వ‌ర‌కు ఏడు వేదిక‌ల్లో టోర్నీ జ‌ర‌గ‌నున్న‌ది. లార్డ్స్ మైదానంలో ఫైన‌ల్ మ్యాచ్ ఆడుతారు.

వ‌ర‌ల్డ్‌క‌ప్ విజేత‌లు ఈసారి 21.8 కోట్ల ప్రైజ్‌మ‌నీ గెలుచుకుంటారు. ఇక ర‌న్న‌ర‌ప్‌కు 10 కోట్లు ఇవ్వ‌నున్నారు. సెమీఫైన‌ల్లోకి ఎంట‌రైన జ‌ట్ల‌కు 6.29 కోట్లు ఇవ్వ‌నున్నారు. ఇక గ్రూపు మ్యాచ్ ఆడిన ప్ర‌తి జ‌ట్టుకు 29 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్నారు. ప్ర‌తి జ‌ట్టుకు క‌నీసం రెండు కోట్లు ద‌క్కే అవ‌కాశాలు ఉన్నట్లు ఐసీసీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -