Thursday, February 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువండర్‌ హాట్‌ మిర్చికి రికార్డు ధర

వండర్‌ హాట్‌ మిర్చికి రికార్డు ధర

- Advertisement -

క్వింటాకు రూ.39,000
ఈ సీజన్‌లో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అత్యధిక రేటు

నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం వండర్‌ హాట్‌ మిర్చికి క్వింటాకు రూ.39,000 రికార్డు ధర పలికింది. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన వినోద్‌ అనే రైతు బుధవారం 8బస్తాల వండర్‌ హాట్‌ మిర్చిని ఏనుమాముల మార్కెట్‌కు తీసుకురాగా భాగ్యలక్ష్మి ఖరీదు ద్వారా కీర్తన అడ్తి వ్యాపారి అత్యధికంగా క్వింటాకు రూ.37,100 ధర పెట్టి కొనుగోలు చేశారు. 2022లో వండర్‌ హాట్‌ మిర్చికి క్వింటాకు రూ.39,000 ధర పలకగా నాలుగేండ్ల అనంతరం ఈ సీజన్‌లో మొదటిసారి వండర్‌ హాట్‌ మిర్చికి అత్యధిక ధర పలకడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, బుధవారం మార్కెట్‌కు వివిధ రకాలకు చెందిన 5వేల మిర్చి బస్తాలు వచ్చాయి.

ఇందులో తేజ రకం మిర్చి బస్తాలు 2000 వరకు రాగా.. గరిష్ట ధర రూ.19,600, కనిష్ట ధర రూ.12,000, మోడల్‌ ధర రూ.17,500 పలికింది. వండర్‌ హాట్‌ మిర్చి 150 బస్తాలు రాగా గరిష్ట ధర రూ.37,100, కనిష్ట ధర రూ.15,000, మోడల్‌ ధర రూ.30,000 వచ్చింది. యూఎస్‌ 341 రకం మిర్చి 2200 బస్తాలు రాగా గరిష్ట ధర రూ.26,200, కనిష్ట ధర రూ.12,500, మోడల్‌ ధర రూ.23,000 పలికింది. దీపిక రకం మిర్చి 50 బస్తాలు రాగా ధర రూ.30,000 పలికింది. యెల్లో రకం మిర్చి 10బస్తాలు రాగా ధర రూ.37,500 పడింది. తాలు 200 బస్తాలు రాగా గరిష్ట ధర రూ.11,000, కనిష్ట ధర రూ.5000, మోడల్‌ ధర రూ.7500 పలికింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -