Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'సుందరకాండ'కు అద్భుతమైన రెస్పాన్స్‌

‘సుందరకాండ’కు అద్భుతమైన రెస్పాన్స్‌

- Advertisement -

”సుందరకాండ’కి వచ్చిన అద్భుతమైన రివ్యూలు చాలా ఆనందాన్నిచ్చాయి. థియేటర్స్‌కి వచ్చి బాగా ఎంజారు చేస్తున్న ఆడియన్స్‌కి థ్యాంక్యూ సో మచ్‌. సినిమాకి చాలా అద్భుతమైన పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఉంది. ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడండి. టికెట్స్‌ అన్నీ కూడా చాలా రీజనబుల్‌ రేట్స్‌లో ఉంచాం.ఫ్యామిలీతో ఈ వీకెండ్‌ వెళ్లి హ్యాపీగా చూడండి. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో ఎంజారు చేసే మంచి చిత్రం ఇది’ అని హీరో నారా రోహిత్‌ అన్నారు.
ఆయన నటించిన తాజా చిత్రం ‘సుందరకాండ’. వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో సందీప్‌ పిక్చర్‌ ప్యాలెస్‌ బ్యానర్‌పై సంతోష్‌ చిన్నపొల్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి నిర్మించారు. బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించి, సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.
ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన థ్యాంక్యూ మీట్‌లో డైరెక్టర్‌ వెంకటేష్‌ నిమ్మలపూడి మాట్లాడుతూ,’ఈ సినిమాని యాక్సెప్ట్‌ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్యూ. సినిమా చూసి అందరూ నవ్వుకుంటున్నారు. నవ్వించడం అంత ఈజీ కాదు. నా రైటింగ్‌కి మంచి అప్రిసియేషన్‌ రావడం చాలా ఆనందాన్నిచ్చింది. హీరో రోహిత్‌, నిర్మాత సంతోష్‌.. వాళ్ళిద్దరూ బిలీవ్‌ చేయకపోతే ఈ సినిమా మీ ముందు ఉండేది కాదు’ అని చెప్పారు. ‘సినిమాకి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌ చాలా ఆనందాన్ని ఇచ్చింది. రెస్పాన్స్‌ రోజు రోజుకి పెరుగుతుంది. యూఎస్‌లో డే వన్‌ కంటే డే టు ఎక్కువ ఉంది. అది మాకు గొప్ప ఎనర్జీని ఇచ్చింది. దిల్‌ రాజు ప్రొడక్షన్‌ నుంచి వచ్చినట్టు చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ తీశారని చెబుతుంటే గొప్ప ఆనందం కలిగింది’ అని నిర్మాత సంతోష్‌ తెలిపారు. మరో నిర్మాత రాకేష్‌ మాట్లాడుతూ,’వెంకీ ఈ స్క్రిప్ట్‌ ఇచ్చినప్పుడు చాలా సెన్సిటివ్‌ పాయింట్‌ అనిపించింది. మేం ఏదైతే ఎగ్జైట్‌ అయ్యామో ఆడియన్స్‌ కూడా సినిమా చూసి అంతే ఎగ్జైట్‌ అవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. రివ్యూస్‌ చాలా అద్భుతంగా వచ్చాయి’ అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad